: హేమమాలిని పార్లమెంటుకు వచ్చేసింది!


బాలీవుడ్ లో నిన్నటి తరం టాప్ హీరోయిన్, బీజేపీ ఎంపీ హేమమాలిని నేటి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. గత నెల 2న రాజస్థాన్ లోని దౌసా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమా గాయపడ్డ విషయం తెలిసిందే. అనంతరం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆమె నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా నేడు ఆమె లోక్ సభకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. ‘‘చాలా కాలం తర్వాత పార్లమెంటుకు వచ్చాను. స్నేహితులు, శ్రేయోభిలాషులు పలకరించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు’’ అని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News