: లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల వినతి మేరకు ముంబయిలోని పీఎంఎల్ఏ కోర్టు వారెంట్ జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ విచారణకు హాజరవకుండా కొంత కాలంగా లండన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ గతంలో అతనికి సమన్లు కూడా పంపింది. అయినప్పటికీ హాజరుకాకపోవడంతో తాజాగా వారెంట్ జారీ చేయాలని కోర్టును కోరింది. వారెంట్ కింద జారీ చేసిన ఉత్తర్వులను హోంమంత్రిత్వ శాఖకు పంపుతామని, వాటిని యూకేలోని హోం డిపార్ట్ మెంట్ కు లేదా ఇంటర్ పోల్ కు పంపవచ్చని ఈడీకి చెందిన ఒకరు తెలిపారు.