: రతన్ టాటాతో కేటీఆర్ భేటీ... టీ హబ్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం


భారత పారిశ్రామిక రంగ దిగ్గజం, టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కొద్దిసేపటి క్రితం ముంబైలో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం ‘టీ హబ్’ను త్వరలో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రతన్ టాటాకు కేటీఆర్ ఆహ్వానం పలికారు. తెలంగాణలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు సహకారమందించేందుకు ‘టీ హబ్’ పేరిట కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ గా ఖ్యాతిగాంచనుంది. రతన్ టాటా లాంటి వారి సలహాలు ఈ కేంద్రానికి ఎంతో ఉపయోగపడతాయన్న భావనతోనే ఆయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ ప్రతిపాదనకు రతన్ టాటా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News