: భారత ఆర్చర్లకు బాబా రాందేవ్ యోగా తరగతులు
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ తో భారత ఆర్చరీ క్రీడాకారులకు యోగా తరగతులు ఇప్పించాలని ఆర్చరీ అసోసియేషన్ నిర్ణయించింది. ఇందుకోసం రాందేవ్ ను కలసి యోగా తరగతులు నిర్వహించాలని అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా కోరారట. వచ్చే ఏడాది రియోలో జరగనున్న ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆర్చర్లు అన్ని విధాలా సిద్ధమయ్యేందుకుగానూ యోగా బాగా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు మల్హోత్రా మాట్లాడుతూ, తీవ్రమైన పోటీల సమయంలో తమ ఆర్చర్లు మానసికంగా బలంగా ఉండాలంటే యోగా తప్పకుండా అవసరమని నిర్ణయించుకున్నామని చెప్పారు. దాంతో వచ్చే సంవత్సరం జరిగే రియో ఒలింపిక్స్ లో ఆర్చర్లు పతకాలు సాధించేందుకు ఇది బాగా సాయపడుతుందని పేర్కొన్నారు.