: తన పరీక్షను వేరే వారితో రాయిస్తూ అడ్డంగా బుక్కైన విద్యాశాఖ మంత్రి సతీమణి


పరీక్ష రాయకుండానే పీజీ డిగ్రీ సంపాదించుకోవాలని ఆమె చేసిన ప్రయత్నం చివరకు ఆమెను దోషిగా నిలబెట్టింది. వివరాల్లోకి వెళ్తే, చత్తీస్ గఢ్ విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ సతీమణి శాంతి కశ్యప్ తాను పరీక్షలు రాయకుండా... తన పరీక్ష రాయడానికి తన సోదరి కిరణ్ మౌర్యను పంపారు. ఈ ఉదయం 10 గంటలకు శాంతి హాల్ టికెట్ తీసుకుని కిరణ్ మౌర్య ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లారు. ఆ తర్వాత ఆమె పరీక్ష రాస్తుండగా, తోటి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఇన్ ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన విషయాన్ని ఆయన వెంటనే పోలీసులకు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ కు వచ్చిన పోలీసులు... కిరణ్ మౌర్యను బయటకు పంపారు. ప్రస్తుతం ఈ విషయం చత్తీస్ గఢ్ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే, జరిగిన ఘటనపై విద్యాశాఖ మంత్రి మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

  • Loading...

More Telugu News