: ఏపీకి ప్రత్యేక హోదానే నా లక్ష్యం... రాజకీయాలతో సంబంధం లేదు: సినీ హీరో శివాజీ


ఏపీకి ప్రత్యేక హోదాపై టాలీవుడ్ హీరో శివాజీ రాజీలేని పోరు సాగిస్తూనే ఉన్నారు. ‘ప్రత్యేకం’ కోసం ఆయన సాగిస్తున్న పోరుకు తానున్న బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా వెరవని ఆయన ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ పేరిట ప్రజా సంఘాలతో కలిసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం మొదలైంది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఈ విషయంలో రాజకీయాలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే దాకా ఉద్యమకారుడిగానే కొనసాగుతానని చెప్పిన ఆయన, లక్ష్యం నెరవేరిన తర్వాత సాధారణ పౌరుడిగా జీవనం సాగిస్తానని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News