: 14 నెలలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ మంద కృష్ణకు దొరకని కేసీఆర్ అపాయింట్ మెంట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు చేశారు. గత 14 నెలలుగా కేసీఆర్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ తనకు ఇంతవరకు ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. తాను తెలంగాణ ఉద్యమంలో కీలక ప్రాత్ర పోషించానని, పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో కలసి పనిచేశానని, కేసీఆర్ కు సైతం అండగా ఉన్నానని... అయినప్పటికీ తనకు అపాయింట్ మెంట్ నిరాకరిస్తున్నారని విమర్శించారు. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మరో విషయం ఏమిటంటే... కేసీఆర్ పై ఇదే తరహా ఆరోపణలు పలువురు ప్రముఖులు కూడా చేస్తున్నారు. తనకు ఇష్టం లేని వ్యక్తులను కలవడానికి కేసీఆర్ ఇష్టపడటం లేదని కొందరు బహిర్గతంగానే విమర్శిస్తున్నారు.