: ఉగ్రదాడిలో ఇద్దరు సైనికుల మృతి, కాల్పుల్లో ఉగ్రవాది హతం


ఈ ఉదయం ఉదంపూర్ సమీపంలో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. బీఎస్ఎఫ్ జరిపిన ఎదురుదాడిలో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, మరో ఐదుగురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ దారిలో చాలా రోజుల తరువాత ఉగ్రవాదులు దాడి జరపడం తనకు ఆందోళన కలిగిస్తోందని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఈ జాతీయ రహదారిని అమర్ నాధ్ యాత్ర కోసం వినియోగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతా దళాలు నిత్యమూ పహారా కాస్తుంటాయి. అయినప్పటికీ, ఆయుధాలు ధరించి ఉగ్రవాదులు రావడం కలకలం రేపింది.

  • Loading...

More Telugu News