: బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదుల దాడి


బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) దళం ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్ పరిధిలోని ఉదంపూర్ కు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఉదంపూర్ కు 10 కిలోమీటర్ల దూరంలో బీఎస్ఎఫ్ కాన్వాయ్ వెళుతుండగా, ఉగ్రవాదులు తుపాకులు, గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. సైన్యం ఈ దాడిని తిప్పికొట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News