: మృతులకు రూ.2 లక్షలు... క్షతగాత్రులకు రూ.50 వేలు: పరిహారం ప్రకటించిన కేంద్రం
మధ్యప్రదేశ్ లోని హర్దా సమీపంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన వారికి రూ.2 లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు అందించనున్నట్లు ఆ ప్రకటనలో కేంద్రం వెల్లడించింది. ఇక గాయాలపాలైన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.