: గత సంవత్సరం రైలు ప్రమాదాల్లో 25 వేల మంది మృతి!
ఒకవైపు సూపర్ ఫాస్ట్, బులెట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కారు ప్రణాళికలు రూపొందిస్తుండగా, మరోవైపు వివిధ ప్రాంతాలలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2014లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో సుమారు 25 వేల మంది మరణించారని, 3,882 మంది గాయపడ్డారని ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం... * 2014లో మొత్తం 28,360 రైలు ప్రమాద కేసులు నమోదయ్యాయి. * 2013తో పోలిస్తే ఈ సంఖ్య 9.2 శాతం తక్కువ. * ఈ కేసులో అత్యధికం రైల్లోంచి జారి పడటం, పట్టాలపై రైళ్లు ఢీకొనడం వంటి ఘటనలు 61 శాతానికి పైగా ఉన్నాయి. * మొత్తం కేసుల్లో 42.5 శాతం మహారాష్ట్రలో జరిగినవే. * సాంకేతిక లోపాలు, రైల్వే ట్రాకుల్లో వైఫల్యం, బ్రిడ్జిలు సరిగ్గా లేకపోవడం తదితర కారణాలతో 469 ప్రమాదాలు జరిగాయి. * తీవ్రవాదుల దుశ్చర్యల కారణంగా 18 ప్రమాదాలు జరుగగా, 18 మంది మరణించారు. * రైలు డ్రైవర్ల తప్పుల కారణంగా 60 ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 67 మంది మరణించారు. * రెండు తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరం రైలు ప్రమాదాల్లో 385 మంది మృతి చెందారు.