: అమరావతి వెళితే ఐదు రోజులే పని!: ఉద్యోగులకు ఏపీ సర్కారు తాయిలం!


సరైన సౌకర్యాలు లేకుండా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అమరావతికి వెళ్లి పనిచేయలేమని ఉద్యోగులు తేల్చిచెబుతున్న తరుణంలో చంద్రబాబు సర్కారు సరికొత్త తాయిలాన్ని ఆశ చూపనుంది. అమరావతికి వెళ్లి పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేస్తామని చెబుతోంది. ప్రస్తుతం టర్కీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగిరాగానే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా, విజయవాడలో కొన్ని భవంతులను అద్దెకు తీసుకుని, వాటిల్లో ప్రధాన కార్యాలయాలను నిర్వహించడం ప్రారంభించి, ఆపై దశలవారీగా అన్ని ఆఫీసులనూ తరలించాలని ఏపీ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News