: 12 మంది మృతి... ఆసుపత్రులలో పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు
మధ్యప్రదేశ్ లోని హర్దా సమీపంలో నిన్న రాత్రి రెండు రైళ్లకు చెందిన 15 బోగీలు నదిలో పడిన ఘటనలో ఇప్పటిదాకా 12 మంది మృత్యువాతపడ్డారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డ ప్రయాణికులను స్థానికులు, సహాయక బృందాలు హర్దాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు తరలివెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులు వరద నీటిలో కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు.