: మ్యాగీ నూడుల్స్ సేఫ్ అంటున్న సీఎఫ్ టీఆర్ఐ ల్యాబ్
మ్యాగీ నూడుల్స్ లో హానికర పదార్థాలున్నాయన్న కారణంగా భారత్ లో కష్టకాలం ఎదుర్కొంటున్న నెస్లే ఇండియా సంస్థకు ఊరట. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతి పొందిన సెంట్రల్ ఫుడ్ టెక్నొలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఎఫ్ టీఆర్ఐ) ల్యాబ్ మ్యాగీ నూడుల్స్ ను పరీక్షించింది. గోవా రాష్ట్రం పంపిన ఐదు శాంపిళ్లను పరీక్షించిన సీఎఫ్ టీఆర్ఐ ల్యాబ్, మ్యాగీ నూడుల్స్ దేశ ఆహార భద్రత ప్రమాణాలకు లోబడే ఉన్నట్టు పేర్కొంది. కాగా, మ్యాగీ నూడుల్స్ లో లెడ్ స్థాయి పరిమితికి మించి ఉందన్న కారణంగా ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో నిషేధించడం తెలిసిందే. దాంతో, కోట్ల విలువైన మ్యాగీ నూడుల్స్ ను నెస్లే ఇండియా సంస్థ మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది.