: మళ్లీ వస్తా... ప్రపంచకప్ ఆడుతా: శ్రీశాంత్ ధీమా
ఫిక్సింగ్ వ్యవహారం కారణంగా క్రికెట్ కు దూరమైన కేరళ పేసర్ శ్రీశాంత్ టీమిండియాలో తన పునరాగమనం ఖాయమంటున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణలెదుర్కొన్న క్రికెటర్లకు కోర్టు నిర్ణయం ఊరటనిచ్చినా, బీసీసీఐ మాత్రం సదరు ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి విచ్చేసిన శ్రీశాంత్ మీడియాతో మాట్లాడాడు. జట్టులోకి వస్తానని, 2019లో జరిగే ప్రపంచకప్ లో ఆడుతానని తెలిపాడు. బీసీసీఐ తనపై నిషేధం తొలగిస్తుందన్న నమ్మకం ఉందని అన్నాడు.