: ఈ స్పోర్ట్స్ పార్క్ లో ఏర్పాటులో నా సలహాలు కూడా ఉన్నాయి: సచిన్


దేశంలో తనకిష్టమైన ఒక ఊరిలో ప్రస్తుతం ఉన్నానని సచిన్ తెలిపాడు. హైదరాబాదు ఇనార్బిట్ మాల్ స్పోర్ట్స్ పార్క్ ను ప్రారంభించిన సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, హైదరాబాదు అంటే తనకు ఇష్టమని అన్నాడు. ఇక్కడ తనకు ఎన్నో మధురస్మృతులు ఉన్నాయని చెప్పాడు. హైదరాబాదులో తనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారని సచిన్ తెలిపాడు. ఫలక్ నుమా ప్యాలెస్ లో గడిపిన క్షణాలు మర్చిపోలేనని చెప్పాడు. హైదరాబాదు బిర్యానీ పేరు చెబితే నోరూరుతుందని సచిన్ అన్నాడు. ఈ స్పోర్ట్స్ పార్క్ లో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారని సచిన్ కితాబిచ్చాడు. ఈ పార్కు ఏర్పాటులో తన సలహాలు కూడా ఉన్నాయని సచిన్ వెల్లడించాడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్నమైన ఆటలు ఆడవచ్చని సచిన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News