: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో బ్రిటన్ కంపెనీల భాగస్వామ్యం కూడా!


నవ్యాంద్ర రాజధాని నిర్మాణంలో సింగపూర్, జపాన్ కంపెనీలతో పాటు ఇప్పుడు బ్రిటన్ కంపెనీలు కూడా భాగస్వామ్యం అయ్యే సూచన కనిపిస్తోంది. ఈ రోజు విజయవాడలోని సీఆర్ డీఏ కార్యాలయంలో అధికారులతో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో ఆకర్షితులయ్యారు. ఆదర్శవంతమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. నిర్మాణంలో బ్రిటీష్ కంపెనీలు కూడా భాగస్వామ్యం అయ్యేలా ప్రయత్నిస్తానన్నారు. క్షేత్ర స్థాయిలో వివరాలు తెలుసుకోవడానికే తాము ఇక్కడికి వచ్చామన్నారు.

  • Loading...

More Telugu News