: కాంగ్రెస్ ఎంపీలపై రేపు సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం


లోక్ సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారన్న కారణంతో 25 మంది కాంగ్రెస్ ఎంపీలను ఐదు రోజుల పాటు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, వారిపై సస్పెన్షన్ ను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎత్తివేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు స్పీకర్, కాంగ్రెస్ నేతల మధ్య బీజేడీ, ఎస్పీ, టీఎంసీ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో సస్పెన్షన్ పై స్పీకర్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని సమాచారం. తమ పార్టీ ఎంపీలపై సస్పెన్షన్ ను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఈ రోజు పార్లమెంటు ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టింది. సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు.

  • Loading...

More Telugu News