: గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన కేసీఆర్... సాయంత్రం భేటీ!


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను ఈ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. ఈ మేరకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరగా, గవర్నర్ అంగీకరించినట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆయన గవర్నరుతో ఏ విషయం చర్చించనున్నారన్న విషయమై ఆసక్తి నెలకొంది. ఆగస్టు 15 సందర్భంగా జీవిత ఖైదు పడ్డ వారి విడుదలపై మాట్లాడేందుకు గవర్నర్ వద్దకు కేసీఆర్ వెళ్లనున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇదే సమయంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు, తలసాని రాజీనామా విషయంపైనా వారి మధ్య చర్చ జరుగుతుందని సమాచారం.

  • Loading...

More Telugu News