: 160 మంది భారత జాలర్లను విడుదల చేసిన పాక్
భారత్ కు చెందిన 160 మంది జాలర్లను పాకిస్థాన్ ఈ రోజు విడుదల చేసింది. వారిలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. తమ తీర ప్రాంతంలో అక్రమంగా చేపలు పడుతున్నారన్న కారణంగా జాలర్లను అరెస్టు చేసిన పాక్ అధికారులు కరాచిలోని లాంది, మాలిర్ జైళ్లలో ఉంచారు. ఇవ్వాళ విడుదలై భారత్ చేరుకోగానే జాలర్లు ఉద్వేగానికి లోనయ్యారు. అయితే వారిలో సత్ర్పవర్తన వచ్చిందనే విడుదల చేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించగా, గతంలో నవాజ్ షరీఫ్, ప్రధాని మోదీ భేటీ అయినప్పుడు జాలర్ల విషయంపై చర్చించారని, అందుకే దేశ జాలర్లను విడిచిపెట్టారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.