: మేకప్ లేని భార్యను చూసి దొంగ అనుకున్నాడు!
స్త్రీలు తమ ముఖారవిందానికి మరింత మెరుగులు దిద్దుకోవడం ఇప్పటిదికాదు. యుగాలుగా వస్తున్నదే. కాలానుగుణంగా అతివల మేకప్ రీతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. బొత్తిగా అందం లోపించిన అమ్మాయిలను సైతం మేకప్ సాయంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అలాంటివారు మేకప్ తీసేస్తే ఎవరో కొత్త వ్యక్తుల్లా కనిపిస్తారు. అల్జీరియాలో ఈ వ్యక్తి కూడా అలాగే పొరబడ్డాడు. భార్యను చూసి దొంగనుకుని బెంబేలెత్తిపోయాడు. పెళ్లికి ముందు ఆమెను చూసిన సదరు వ్యక్తి ఎంతో ముచ్చటపడ్డాడు. మేకప్ లో జిగేల్మంటూ కనిపించడంతో కాబోయే భార్య అందగత్తేనని తీర్మానించుకున్నాడు. పెళ్లిలోనూ ఫుల్ మేకప్ తో అమ్మడు బాగానే మేనేజ్ చేసింది. అయితే, పెళ్లి అనంతరం కొత్త కాపురం మొదలుపెట్టేందుకు నూతన నివాసానికి వెళ్లగా, ఆ మరుసటి రోజే అమ్మడి మేకప్ గుట్టురట్టయింది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసిన అతగాడు పక్కన ఎవరో కొత్త స్త్రీ ఉన్నట్టు గుర్తించి, 'దొంగ దొంగ' అంటూ కేకలు పెట్టాడు. ఆనక, ఆమె తన భార్యేనని, మేకప్ తీసేసేసరికి అలా ఒరిజినల్ గెటప్పులో కనిపించిందని అర్థం చేసుకుని లబోదిబోమన్నాడు. అనంతరం, తనను మోసం చేశారంటూ కోర్టుకెక్కాడు.