: ఫోటోతో ఆర్ సీ, 'హరితహారం'తో లైసెన్స్!
తెలంగాణలో ఇకపై వాహనదారులకు సొంత ఫోటోలతో కూడిన ఆర్ సీలు జారీ చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఉదయం తన శాఖ అధికారులతో జరిపిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రైవింగ్ లైసెన్స్ కార్డులపై హరితహారం లోగోను ముద్రించనున్నట్టు కూడా ఆయన వివరించారు. హరితహారం కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజలు తమ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పై తమ ఫోటోను కోరుకుంటున్నారని వివరించారు. త్వరలో రవాణా శాఖలో, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురానున్నామని మహేందర్ రెడ్డి తెలిపారు.