: మా వద్ద చదివిన విద్యార్థులే కిడ్నాప్ చేశారు, హైదరాబాదీలు క్షేమం: లక్ష్మీకాంత్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు పట్టుబడి ఆపై వారి చెర నుంచి బయటపడి ఇండియాకు చేరుకున్న బెంగళూరు వాసి లక్ష్మీకాంత్ రామకృష్ణ, తమను కిడ్నాప్ చేయడం తప్పని ఐఎస్ఐఎస్ సభ్యులు అంగీకరించినట్టు తెలిపారు. తనతో పాటు కిడ్నాప్ నకు గురైన హైదరాబాదీలు క్షేమంగా ఉన్నారని అన్నారు. తమను కిడ్నాప్ చేసింది వర్శిటీ విద్యార్థులుగా ఉండి ఆ తరువాత ఉగ్రవాదులుగా మారిన వారేనని తెలిపారు. వీరంతా 13 నుంచి 17 సంవత్సరాల వయసువారేనని, తమను బాగా చూసుకున్నారని తెలిపారు. వీళ్ల లీడర్ పేరు షేక్ అని, తాను తిరిగి వచ్చేటప్పుడు ఆయన మాట్లాడుతూ, మిగతా ఇద్దరి గురించి ఆందోళన వద్దని చెప్పినట్టు వివరించారు. హైదరాబాదీలు క్షేమంగా తిరిగి వస్తారని చెప్పారు. కిడ్నాప్ చేసిన రెండు రోజులకు తనను విడుదల చేశారని తెలిపారు. నేడు తన జీవితంలో అత్యంత ఆనందకరమైన దినమని వ్యాఖ్యానించారు.