: ప్రత్యేక హోదా ధర్నాకు రెండు రైళ్లల్లో ఢిల్లీకి!: వైకాపా


ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు ఏపీ నుంచి రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు వివరించారు. ఈ ఉదయం హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ రైళ్లు అనకాపల్లి, తిరుపతి నుంచి బయలుదేరుతాయని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువచ్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి చేయడమే ధర్నా ముఖ్య ఉద్దేశమని వివరించారు. నష్టపోతున్న ఏపీ తరపున వైకాపా పోరాడుతుందని తెలిపారు. ఈ ధర్నాలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనాలని ధర్మాన కోరారు. కాగా, ఈ నెల 10న జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News