: కేంద్రం అత్యుత్సాహంతో నిలిచిన కామెడీ వెబ్ సైట్లు
అశ్లీలత నిండిన వెబ్ సైట్లను ఆపివేయాలని కేంద్రం చూపిన అత్యుత్సాహం, అమాయక వెబ్ సైట్లపైనా పడింది. మొత్తం 857 వెబ్ సైట్లు బ్లాక్ చేయాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఐఎస్ పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్)కి లేఖలు రాయగా, అందులో అశ్లీలతతో సంబంధం లేని వెబ్ సైట్ల పేర్లూ ఉన్నాయి. 'కాలేజ్ హ్యూమర్ డాట్ కాం', '9 గాగ్ డాట్ టీవీ' తదితరాలు బ్లాక్ అయ్యాయి. వీటికి, అశ్లీలతకూ ఎటువంటి సంబంధమూ లేదు. ఈ వెబ్ సైట్లు కేవలం వినోదాన్ని పంచేవే. పాప్ కల్చర్ కు సంబంధించి ఫన్నీ కంటెంట్ ను కలిగివుండేవి. కాలేజ్ హ్యూమర్ వెబ్ సైట్లో విద్యార్థులు గీసిన చిత్రాలు, పలు ఒరిజినల్ వీడియోలు ఉంటాయి. వీటిల్లో అశ్లీలతకు తావులేదని, వీటిని ఎందుకు బ్యాన్ చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు.