: డబ్బుతో సెటిల్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారు: రోజా


సంచలనం సృష్టించిన వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలను డబ్బుతో సెటిల్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఇది అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఈరోజు తిరుపతిలో యాంటీ ర్యాగింగ్ పోస్టర్ ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరవైందని అన్నారు. రిషితేశ్వరి ఘటనపై హోం మంత్రి చినరాజప్ప ఇంతవరకు స్పందించలేదని మండిపడ్డారు. రిషితేశ్వరి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని... నాగార్జున యూనివర్శిటీ వీసీని, ప్రిన్సిపల్ ను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News