: 'దృశ్యం' చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించిన కేజ్రీవాల్
'దృశ్యం' సినిమా చాలా అద్భుతంగా ఉందని... ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన చిత్రమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కితాబిచ్చారు. ఈ సినిమాను ఈరోజు ఆయన ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. 'దృశ్యం' చిత్రం తెలుగు, తమిళం, మలయాళంలతో పాటు హిందీ భాషలో కూడా తెరకెక్కింది. హిందీ వర్షన్ లో అజయ్ దేవగణ్ సరసన శ్రియ నటించగా, పోలీసు అధికారిగా టబు నటించింది.