: ఉదయం గాంధీ విగ్రహం, మధ్యాహ్నం బీజేపీ హెడ్ క్వార్టర్స్... కాంగ్రెస్ నిరసన హోరు


ఎంపీల సస్పెన్షన్ పై విపక్ష కాంగ్రెస్ భగ్గుమంది. కొద్దిసేపటి క్రితం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పార్టీ అతిరథ మహారథులంతా ఈ నిరసన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ వీసాకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని పట్టుబడుతూ లోక్ సభలో ప్లకార్డులు ప్రదర్శించిన 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై నిన్న స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్ పై నిన్న సభలోనే నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ, నేటి ఉదయం ప్రత్యక్ష కార్యరంగంలోకి దిగింది. కొద్దిసేపటి క్రితం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు తెరతీసిన కాంగ్రెస్, నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిర్ణయించింది. కాంగ్రెస్ ఆందోళనలకు సమాజ్ వాదీ పార్టీ సహా పలు పార్టీలు మద్దతు పలకనున్నాయి.

  • Loading...

More Telugu News