: 'అశ్లీలం'పై నిషేధం లేదు, కేవలం నిఘానే: టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్


అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, మోదీ సర్కారు నష్టనివారణ చర్యలకు దిగింది. పోర్న్ వెబ్ సైట్లకు అడ్డుకట్ట వేస్తే అది వైద్య, విజ్ఞాన రంగాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని గల్లంతు చేస్తుందని శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు హెచ్చరించిన మీదట, అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం విధించడం తమ ఉద్దేశం కాదని, వాటిని పర్యవేక్షిస్తూ ఉండాలన్నది తమ అభిమతమని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. త్వరలోనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అంబుడ్స్ మన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, విపరీత పరిణామాలు తలెత్తకముందే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. కాగా, కొన్ని ముఖ్యమైన పదాల ఆధారంగా పనిచేసే వెబ్ ఫిల్టర్లు, ఎయిడ్ పై ఉన్న లక్షలాది పేజీల సమాచారాన్ని నెటిజన్లకు చేరకుండా అడ్డు పడుతుంది. ఇదే సమయంలో మరెన్నో వెబ్ ఫిల్టర్లకు దొరకని పదాల ద్వారా అశ్లీల సైట్లలోకి వెళ్లే అవకాశాలు ఉండటంతో, పోర్న్ సైట్లపై బ్యాన్ బదులు నిఘా పెట్టాలని కేంద్రం యోచిస్తోంది.

  • Loading...

More Telugu News