: దీనానగర్ ఉగ్రదాడి వెనుక ‘ముంబై దాడుల మాస్టర్ మైండ్’... నిఘా వర్గాల అనుమానం


పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై జరిగిన ఉగ్రవాద దాడికి 2008 ముంబై దాడుల మాస్టర్ మైండ్, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పథక రచన చేశాడా? అంటే, అవుననే అంటున్నాయి భారత నిఘా వర్గాలు. దీనానగర్ దాడిలో లష్కరే తోయిబా హస్తముందని ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చిన నిఘా వర్గాలు, హఫీజ్ సయీద్ ప్రమేయం కూడా లేకపోలేదని భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటిదాకా లభించిన సమాచారంలో హఫీజ్ సయీద్ పాత్రను రూఢీ చేసే ఆధారాలు కూడా లభ్యమయ్యాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News