: హైదరాబాదుకు మాస్టర్ బ్లాస్టర్... అభిషేక్, ఐశ్వర్య కూడా!


భారత క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ రమేశ్ టెండూల్కర్ నేడు హైదరాబాదుకు రానున్నాడు. ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూడా భాగ్యనగరికి వస్తున్నారు. ప్రొ కబడ్డీ లీగ్ లో నేడు హైదరాబాదులోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లకు వీరు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. గ్రామీణ క్రీడ కబడ్డీకి ప్రొ కబడ్డీ పేరిట విశేష ప్రాచుర్యం కల్పించడంలో అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో దూసుకెళుతున్నాడు. జైపూర్ పింక్ పాంథర్స్ పేరిట ప్రొ కబడ్డీ లీగ్ లో ఓ జట్టును కొనుగోలు చేసిన అభిషేక్, ఈ లీగ్ కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రముఖులను స్టేడియాలకు రప్పిస్తున్నాడు. అభిషేక్ ఆహ్వానం మేరకే సచిన్ నేటి మ్యాచ్ లను వీక్షించేందుకు వస్తున్నాడు.

  • Loading...

More Telugu News