: టీ-సోలార్ టెండర్లకు పోటెత్తిన బిడ్లు... క్యూ కట్టిన 184 సంస్థలు
సోలార్ విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ కు భారీ స్పందన లభించింది. కేవలం 2 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం టెండర్లు ఆహ్వానిస్తే, 4,623 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తామంటూ పారిశ్రామిక సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు నిన్న సాయంత్రం ముగిసిన టెండర్ల దాఖలుకు 184 కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. అంతేకాక యూనిట్ ఒక్కింటిని రూ.5.17లకే ఉత్పత్తి చేస్తామంటూ సంస్థలు ముందుకు రావడంతో సర్కారు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది. ఇక దాఖలైన బిడ్ల మేరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.