: కోరి జైల్లో ఉంటే... కోర్టులేం చేస్తాయ్?: సుబ్రతా రాయ్ కి సుప్రీం చీవాట్లు


సహారా గ్రూపు సంస్థల చీఫ్ సుబ్రతా రాయ్ జైలు జీవితం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. మానవతా దృష్టితో తనను బెయిల్ పై విడుదల చేయాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుబ్రతా రాయ్ జైలు జీవితం ఆయన ఎంపిక చేసుకున్నదేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఇబ్బంది కలిగించే అంశం ఏంటంటే... సుబ్రతా రాయ్ తన ఆస్తుల విలువ రూ.1,85,000 కోట్లని చెబుతున్నారు. తన వద్ద ఎంతో ధనముందని చెబుతున్న ఆయన, తాను చెబుతున్న సొమ్ములో కేవలం ఐదో వంతు మాత్రం చెల్లించలేకపోతున్నారు. మీ సొమ్ములో మీరు చెల్లించాల్సింది ఐదో వంతు మాత్రమే. ఎంతో సంపద ఉన్న వ్యక్తి, సొమ్ము చెల్లించకుండా తన స్వేచ్ఛను జైలు పరం చేసుకుంటున్నారు’’ అని జస్టిస్ ఠాకూర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News