: పాత స్నేహితుడిని సర్ ప్రైజ్ చేసిన కెప్టెన్ కూల్!


ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకుని టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన స్నేహితుడు విపిన్ సింగ్ కు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. నేరుగా ఫోన్ చేసి, ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు తెలపడమే కాక ఇంటికి పిలిచి ఘనంగా విందు ఇచ్చాడు. అసలు విపిన్ సింగ్ ఎవరని ఆరా తీస్తే... గతంలో రైల్వేస్ లో టీటీగా పనిచేస్తున్న సమయంలో జార్ఖండ్ జట్టుకు ధోనీ ఆడుతుండగా, అదే ఉద్యోగంలో ఉన్న విపిన్ సింగ్ ఛత్తీస్ గఢ్ కు ఆడేవాడు. టోర్నీల సందర్భంగా ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారట. ఈ క్రమంలో విపిన్ తో ధోనీకి గాఢమైన స్నేహం ఏర్పడింది. అయితే టీమిండియా జట్టులో ధోనీకి చోటు దక్కడం, ఆ తర్వాత కెప్టెన్ గా ఎదగడంతో గడచిన ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య మాటలే కుదరలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఫ్రెండ్ షిప్ డే ను పురస్కరించుకుని విపిన్ కు ఫోన్ చేసిన ధోనీ అతడిని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. చిరకాల మిత్రుడి ఆహ్వానం మేరకు విపిన్, ధోనీ ఇంటిలో విందుకు హాజరయ్యాడు.

  • Loading...

More Telugu News