: అభిమానులకు బహుమతినిచ్చిన మహేష్ బాబు


'శ్రీమంతుడు' సినిమా విడుదలకు మరో నాలుగు రోజుల సమయముంది. అంతవరకు ఊరించడం ఎందుకు? అనుకున్నాడో ఏమో కానీ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు మంచి కానుక అందించాడు. తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో 'ఎంజాయ్ చేయండి' అంటూ 'దిమ్మ తిరిగే దిమ్మతిరిగే...దుమ్ముగా దుమ్ముగా దిమ్మతిరిగే' అని సాగే 40 సెకెన్ల నిడివి గల వీడియో పాటను విడుదల చేశాడు. దీని వీడియో లింక్ ను కూడా పెట్టాడు. దీంతో మహేష్ అభిమానులు ఖుషీ చేసుకుంటున్నారు. మైత్రీ మువీ మేకర్స్, మహేష్ బాబు నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మించిన 'శ్రీమంతుడు' సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News