: హిందూ మతానికి అలాంటి అవసరం లేదు: శివసేన
'హిందూ టెర్రరిజం' అనే పదం ఈ మధ్యకాలంలో చాలా వ్యాప్తి చెందిందని, దానిని ఖండించాలని శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో పిలుపునిచ్చింది. భారత దేశం వందశాతం హిందూదేశమని సంపాదకీయంలో స్పష్టం చేశారు. ఉగ్రవాద వ్యాప్తికి హిందూ మతం ఎన్నటికీ పని చేయదని, అలాంటి అవసరం కూడా భారతదేశానికి లేదని అందులో పేర్కొన్నారు. సొంత దేశాన్ని భద్రంగా ఉంచాలని భావించే మతం హిందూ మతం అని శివసేన సామ్నాలో పునరుద్ఘాటించింది. ఉగ్రవాదాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని శివసేన తెలిపింది. ఉగ్రవాదంపై పోరులో దేశం మొత్తం ఒక్కటిగా స్పందిస్తుందని స్పష్టం చేసింది.