: సోనాక్షిని నిలువనీయని 'అండర్ వరల్డ్ డాన్' చెల్లి పాత్ర!
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి పాత్ర నిలువనీయడం లేదట. దావూద్ ఇబ్రహీం చెల్లి హసీనా పర్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సోనాక్షి ప్రధాన పాత్ర పోషించనుంది. అపూర్వ లఖియా తెరకెక్కించనున్న ఈ సినిమా స్క్రిప్టు అద్భుతంగా ఉందని సోనాక్షి తెలిపింది. 'శేఖర్ అందించిన స్క్రిప్టుపై పని ప్రారంభించడమే తరువాయి' అని సోనాక్షి చెప్పింది. స్క్రిప్టు విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు షూటింగ్ లో పాల్గొంటానా అని ఎదురు చూస్తున్నానని వెల్లడించింది. కాగా, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకి ఇద్దరు చెల్లెళ్లు. ఒకరు హసీనా పర్కర్ కాగా, ఇంకొకరు సైదా పర్కర్. 12 మంది సంతానంలో ఏడవదైన హసీనా పర్కర్ మాఫియా క్వీన్ గా ముంబైలో వినుతికెక్కింది. కూతురు, కొడుకుతో కలిసి ముంబైలోని నాగ్ పాడా ప్రాంతంలో చాలాకాలం నివాసమున్న హసీనా గతేడాది గుండెపోటుతో మృతి చెందింది.