: సరికొత్త పరీక్షా విధానం...భవిష్యత్ 'వైవా'లు ఇలాగే జరుగుతాయా?


పరీక్షా విధానంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది ఢిల్లీ యూనివర్సిటీ. పీహెచ్ డీ విద్యార్ధులకు నిర్వహించనున్న మౌఖిక (వైవా) పరీక్షలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేందుకు ఢిల్లీ యూనివర్సిటీ అనుమతిచ్చింది. దీంతో విదేశాల్లో, వేరే ప్రాంతాల్లో ఉండే ఢిల్లీ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థులకు వెసులుబాటు కలుగనుంది. విదేశాల్లో, వేరే ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు వీడియో కాన్ఫరెన్స్, స్కైవ్ ద్వారా వైవా నిర్వహించనున్నారు. ఈ పద్ధతిలో నిర్వహించే వైవాలో అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. అలాగే పీహెచ్ డీ కాల పరిమితిని నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచుతున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది. ఢిల్లీ యూనివర్సిటీ వైవా పరీక్షా విధానంపై ఉత్తమ ఫలితాలు వస్తే, భవిష్యత్ లో యూనివర్సిటీలన్నీ ఈ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News