: జేడి(యు) టికెట్ పై శత్రుఘ్నసిన్హా భార్య పోటీ?


బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య పూనమ్ సిన్హాను కూడా ఎన్నికల బరిలోకి దింపే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యు) తరపున ఆమెను బరిలోకి దించేందుకు షాట్ గన్ మద్దతుదారులు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బంకీపుర్ లేదా డిఘా నియోజకవర్గాల నుంచి పూనమ్ ను పోటీ చేయాలన్న ప్రతిపాదనను జేడీ(యు)నే ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంతవరకు దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, బీహార్ సీఎం, బీజేపీ నేత అయిన శత్రుఘ్న సిన్హాలు కొన్ని రోజుల కిందట సమావేశమవడం ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది.

  • Loading...

More Telugu News