: పోలీసుల కవాతు, శకటాల ప్రదర్శన లేకుండానే తెలంగాణలో ఆగస్టు 15 వేడుకలు
తెలంగాణలో ఈసారి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా సాధారణంగా జరగనున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం ఎలాంటి పోలీసు కవాతు, శకటాల ప్రదర్శన లేకుండానే వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే! గోల్కొండ కోటలో మరోసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎస్ రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ వేడుకల నిర్వహణపై చర్చించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకల్లా కోటలో సీఎం జాతీయపతాకాన్ని ఎగురవేయనున్నారు. కేవలం తెలంగాణ కళారూపాలను మాత్రమే ఈ సందర్భంగా ప్రదర్శించాలని నిర్ణయించారు.