: ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐడీ పిటిషన్ పై విచారణ వాయిదా
మత్తయ్య, ఆతని భార్య, మరో ఇద్దరి కాల్ డేటా ఇవ్వాలంటూ విజయవాడ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కాల్ డేటా ఇవ్వాలంటూ గతంలోనే కోర్టు ఆదేశించినప్పటికీ సర్వీస్ ప్రొవైడర్లు ఇంతవరకూ ఇవ్వలేదు. అయితే తమకు సమయం కావాలని వారు కోరడంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.