: ఇన్వెస్టర్లకు లాభాలు పండించిన మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్, ఇమామి, అమర్ రాజా...


గత కొంత కాలంగా, భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకుల మధ్య సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆల్ టైం రికార్డు స్థాయితో పోలిస్తే సెన్సెక్స్, నిఫ్టీలు 10 శాతానికి పైగా నష్టంలో ఉన్నాయి. అయినప్పటికీ, 209 కంపెనీల ఈక్విటీ విలువ 52 వారాల గరిష్ఠస్థాయిని తాకింది. వీటిల్లో 116 కంపెనీల ఈక్విటీలు జీవితకాల రికార్డు ధరకు వెళ్లాయి. ఈ కంపెనీల తొలి త్రైమాసికం ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో పాటు, వీటిపై వస్తున్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచడంతో, దేశవాళీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నూతన కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో కోల్ ఇండియా, మారుతి సుజుకి, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఇమామి, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అమర రాజా బ్యాటరీస్, బజాజ్ ఫిన్ సర్వ్ తదితర కంపెనీలు తమను నమ్ముకున్న ఇన్వెస్టర్లకు లాభాలను పండించాయి. బ్యాంకుల్లో మూలధనాన్ని పెంచేందుకు కేంద్రం అంగీకరించడం, రెట్రాస్పెక్టివ్ పన్నుపై స్పష్టత రావడం, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల సరళి తదితరాలు గత రెండు సెషన్లలో మార్కెట్ ను లాభాల్లో నిలిపిన సంగతి తెలిసిందే. కాగా, నేడు వన్ ఇయర్ హైని తాకిన కంపెనీల్లో 20 కంపెనీలు 'ఏ' గ్రూప్ లో ఉండగా, 140 సంస్థలు 'బి' గ్రూప్ లో, 49 సంస్థలు 'టి' గ్రూప్ లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News