: 'పీకే' సినిమాలో పోలీసులపై వ్యాఖ్య...అమీర్ ఖాన్ పై కేసు నమోదు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 'పీకే' సినిమాలో పోలీసులను ఉద్దేశించి అమీర్ ఖాన్ 'తుల్లా' అనే పదాన్ని ఉపయోగించాడని ఆరోపిస్తూ, ఉల్లాన్ అనే ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెలలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా పోలీసులపై తుల్లా అనే పదాన్ని వాడారని... దీంతో, ఆయనపై కేసు నమోదు చేశారని ఉల్లాన్ గుర్తు చేశారు. కేజ్రీవాల్ పై కేసు నమోదైనప్పుడు, అమీర్ ఖాన్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. ఆధారాల కోసం పీకే సినిమా డీవీడీని కూడా పోలీసులకు అందజేశారు. దీంతో, అమీర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.