: హోదాపై వెంకయ్యనాయుడు మాట మారుస్తున్నారు: నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట మారుస్తున్నారని నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆరోపించింది. రాష్ట్రానికి ద్రోహం చేసిన ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. విజయవాడలో ఈ మేరకు సమావేశమైన విద్యార్థి జేఏసీ, ప్రత్యేక హోదా సాధనకై ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ చేపట్టాలని నిర్ణయించింది. అంతేగాక ప్రధానికి 10 లక్షల పోస్ట్ కార్డుల ఉద్యమం కూడా చేస్తున్నామని చెప్పింది.