: ఉస్మానియా ఆసుపత్రి తరలింపుపై హైకోర్టులో వ్యాజ్యం
హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి తరలింపుపై ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాలైంది. విచారణకు స్వీకరించిన కోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ఉస్మానియాలో చాలా భవనాలు కూలిపోయే దశకు వచ్చాయని, కూల్చివేసి కొత్త నిర్మాణాలను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి ఆసుపత్రిలోని రోగులను పలు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అయితే దాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఉస్మానియాను సందర్శించాయి. ఏళ్లనాటి ఆసుపత్రిని కూల్చివేయడం సరికాదని అక్కడ ఉన్న స్థలంలోనే కొత్త భవంతులు కట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు స్టే ఇస్తుందో, లేక పిల్ ను తిరస్కరిస్తుందో చూడాలి.