: రికార్డు సృష్టించే దిశగా పట్టిసీమ... ఇనుమడించనున్న చంద్రబాబు పేరు, ప్రఖ్యాతులు


ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు అరుదైన రికార్డును సొంతం చేసుకునే దిశగా కొనసాగుతోంది. సరిగ్గా 103 రోజుల క్రితం ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ఆగస్టు 15వ తేదీ నాటికి తొలి దశ పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో, దాదాపు 150 మంది ఇంజినీర్లు, పర్యవేక్షకులు కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. మరో 1,350 మంది నిర్మాణపు పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ పనుల్లో జాప్యం జరగకుండా పదే పదే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో, ఆగస్టు 15వ తేదీ నాటికి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే... దేశంలోనే అతి తక్కువ సమయంలో తొలి దశను పూర్తి చేసుకున్న ప్రాజెక్టుగా ఇది రికార్డులకు ఎక్కుతుంది. గతంలో మధ్యప్రదేశ్ లోని నర్మదా-కిస్ట్రా ప్రాజెక్టు పేరిట ఈ రికార్డు ఉంది. అయితే, పట్టిసీమతో పోల్చుకుంటే నర్మదా-కిస్ట్రా ప్రాజెక్టుకు చాలా ఎక్కువ రోజులు పట్టింది. అనుకున్న సమయానికి పట్టిసీమ పూర్తయితే చంద్రబాబు పేరు, ప్రఖ్యాతులు మరింత పెరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News