: పార్లమెంటు వ్యూహాలకు పదును పెడుతున్న రాహుల్... నేడు ఎంపీలతో ప్రత్యేక భేటీ


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తన పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కేంద్రం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను పార్లమెంటులో విపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేకపోతోందని, అదే సమయంలో అధికార పార్టీ ఎదురుదాడికి ఆస్కారమిచ్చేలా తమ వైఖరి ఉంటుందోన్న పార్టీ నేతల అభిప్రాయాల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటులో పార్టీ వ్యూహాలకు పదును పెట్టే విషయంపైనే రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News