: స్టిక్ పట్టినా, తుపాకీ పట్టినా దేశం కోసమే పోరాటం... ముష్కరులను మట్టుబెట్టిన మాజీ హాకీ స్టార్ ప్లేయర్


జులై 27న పంజాబ్ లోని గుర్ దాస్ పూర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎస్పీ సహా 10 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అనంతరం ఎన్ఎస్జీ, భారత సైన్యంతో కలసి పంజాబ్ పోలీసులు ముష్కరులను మట్టుబెట్టారు. ఈ ఎన్ కౌంటర్ లో మాజీ హాకీ స్టార్ ప్లేయర్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ జుగ్ రాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు. 32 ఏళ్ల జుగ్ రాజ్ హాకీ నుంచి రిటైరైన తర్వాత పంజాబ్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన అమృత్ సర్ లో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఉగ్రదాడి సమాచారం అందిన వెంటనే ఉదయం 8.15 గంటలకు జుగ్ రాజ్ దినానగర్ చేరుకున్నారు. అనంతరం, తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో పాల్గొని ఉగ్రవాదులను హతమార్చడంలో తనదైన పాత్ర పోషించారు. 2003లో రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత హాకీ నుంచి జుగ్ రాజ్ రిటైరయ్యారు. కొంతకాలం హాకీ కోచింగ్ ఇచ్చి, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్ మెంట్ లో బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News