: రాజమౌళికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్న రకుల్


టాలీవుడ్ తాజా సుందరి రకుల్ ప్రీత్ సింగ్ బాహుబలి సినిమా చూసి ఫిదా అయిపోయింది. ఆలస్యమైనప్పటికీ చివరకు బాహుబలిని చూశానని... ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని ట్వీట్ చేసింది. ఇంత గొప్ప సినిమా తీయగలిగిన తెలుగు సినీ పరిశ్రమలో తాను కూడా భాగం అయినందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పింది. సినిమాను ఇంత గొప్పగా తెరకెక్కించిన రాజమౌళికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపింది. బాహుబలిలో ప్రభాస్, రానా, తమన్నా, రమ్యకృష్ణల నటన అద్భుతంగా ఉందని కితాబిచ్చింది.

  • Loading...

More Telugu News