: రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలడం ఖాయం: పాల్వాయి
టీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు భారీగా పెరిగిపోయాయని టీకాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్లు, పరిశ్రమల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని... ఆయన సోదరుడు కలెక్షన్ ఏజంటుగా మారారని అన్నారు. ప్రభాకర్ రెడ్డి అవినీతి వెనుక మంత్రి జగదీష్ రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. త్వరలోనే ఈ ఎమ్మెల్యే వసూళ్ల వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళతానని అన్నారు. మరో రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోక తప్పదని జోస్యం చెప్పారు.